చల్లూరు క్రషర్‌తో ప్రభుత్వ విప్ అయిలయ్యకు సంబంధం లేదు
కర్నాటి శ్రీదేవి
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 21: శ్రీని డెవలపర్స్ క్రషర్స్ యాజమాన్యానికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు ఎలాంటి సంబంధం లేదని శ్రీనిధి డెవలపర్స్ క్రషర్స్ పై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని శ్రీనిధి డెవలపర్స్ క్రషర్స్ అధినేత కర్నాటి శ్రీదేవి అన్నారు. మంగళవారం చల్లూరులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ శ్రీని డెవలపర్స్ క్రషరర్స్ కు ఎమ్మెల్యే కు ఎలాంటి సంబంధం లేదని కావాల నే కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పైన నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు.
క్రషర్ అధినేతగా నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. 2019 ఏప్రిల్ నెలలో శ్రీనీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పేరుతో చల్లూరు గ్రామంలో సర్వేనెంబర్ 322 అనుబంధ నెంబర్లలో 70 ఎకరాల భూమికి డీటీసీపీ ద్వారా లేఅవుట్ అనుమతులు పొందామని,లేఅవుట్ ప్రాంతంలో ఎక్కువగా రాయి ఉం డటంతో, అభివృద్ధి పనుల కోసం బ్లాస్టింగ్ అవసరం ఏర్పడిందని ఈ నేపథ్యంలో నా భర్త స్వర్గీయ నారాయణరావు 2021లో క్రషర్ యూనిట్ అన్ని ప్రభుత్వ విభాగాల నుండి ఇండస్ట్రీస్, పొల్యూషన్ కంట్రోల్, ఎలక్ట్రిసిటీ విభాగాల నుండి అవసరమైన అనుమతులు తీసుకున్నారన్నారు.
మొదటి వెంచర్లో బ్లాస్టింగ్ ద్వారా వచ్చిన రాయిని మేము లేఅవుట్ రోడ్ల నిర్మాణం అభివృద్ధి పనుల కోసం మాత్రమే వినియోగించుకున్నామన్నారు.2024 ఆగస్టు 8న నా భర్త శ్రీ నారాయణరావు మరణించడంతో, క్రషర్ యూనిట్ను శ్రీ హరి కి లీజుకు ఇవ్వడం జరిగిందనీ మా శ్రీనిధి డెవలప్మెంట్, క్రషర్స్ తో గత పాలకులు కాని ప్రస్తుత పాలకులు గానీ ఎలాంటి సం బంధాలు లేవన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి క్రషర్ ను నడుపుతుంటే కొందరు కావాలని మా క్రషర్స్ పైన దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా నిరాధార ఆరోపణలు మానుకోవాలన్నారు.






