ప్రభుత్వ విద్యార్థులదే పైచేయి
విద్యార్థులకు బహుమతుల పంపిణీ లో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి, మే 17 (విజయ క్రాంతి) ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యా వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు పాల్గొన్నా రు. అనంతరం జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రభు త్వ విప్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి 10వ తరగతి, ఇంటర్ పరీక్షలో అధిక మార్కులు సాధించిన 11 మంది విద్యార్థులను సన్మానిస్తూ, వారికి రూ.10 వేల చొప్పున నగదు బహుమతి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాలలో పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకున్న 98 మందికి పైగా విద్యార్థులు 550కు పైగా మార్కులు సాధించడం ఆనందదాయకమని తెలిపారు. ఈ ఫలితాల సాధనలో కృషి చేసిన ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునీకరణ పనులు, టాయిలెట్లు, అదనపు తరగతి గదులు, తాగునీటి సదుపాయాలు, చిన్నపాటి మరమ్మత్తులు వంటి అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు మంజూరు చేసి పూర్తి చేశారని,ప్రస్తుతం అనేక ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు.
పెద్దపల్లి పట్టణ పరిధిలో పదవ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన 98 మంది విద్యార్థులు ఉన్నారని, మిగిలిన ఐదు గ్రామీణ మండలాల్లో 138 మందికి పైగా విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. వీరందరికీ రాబోయే రోజుల్లో సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మరింత గుర్తింపు లభించడంతో పాటు ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు చేసిన కృషి సమాజానికి తెలియజేసే అవకాశం ఉంటుందని అన్నారు. వచ్చే ఏడాది సన్మానించే విద్యార్థుల సంఖ్య రెట్టింపు కావాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చిన మంచి ఫలితాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని కలెక్టర్ సహా ఉన్నతాధికారులను ప్రభుత్వ విప్ సూచించారు. ప్రతి హైస్కూల్ పరిధిలో మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఇంటర్ చదివే దశలో కొంతమంది విద్యార్థులు చెడు అలవాట్లకు గురయ్యే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
విద్యార్థులు ఎటువంటి చెడు అలవాట్లకు ఆకర్షితులు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో జిల్లా విద్యాశాఖ అధికారి జి.శారద, జి ల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపా ధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.






