6 July, 2026 | 1:25 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

భక్తి శ్రద్ధలతో ఘనంగా ఎల్లారం పోచమ్మ బోనాలు..

05-02-2026 05:48 PM

దేవర వినోద్ స్వామి

బెజ్జూర్ ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి ): బెజ్జూర్ మండలంలోని మత్తడి స్ప్రింగ్ గానకట్ట సమీపంలో ఎల్లారం పోచమ్మ బోనాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఇట్టి బోనాల ఉత్సవానికి ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం లోని ఇందిరానగర్ శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి దేవస్థాన ప్రధాన అర్చకులు దేవార వినోద్ స్వామి ఆధ్వర్యంలో ఎల్లారం పోచమ్మ బోనాల ఊరేగింపు ఆలయం చుట్టూ నిర్వహించారు.

అనంతరం బోనాలను అమ్మవారికి సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు దేవర వినోద్ స్వామి నిర్వహించి భక్తులకు పూజ చేసే విధానం గురించి భక్తి మార్గం గురించి భక్తులకు పలు సలహాలు సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు జిల్లాల సుధాకర్ గౌడ్,జాతర నిర్వాహకులు కొండవీటి భాస్కర్ రాజ్, సర్పంచ్ చెండే పద్మ శంకర్, కృష్ణ పల్లి సర్పంచ్ లావణ్య, కొట్రంగి రామకృష్ణ, కేశెట్టి శ్రీనివాస్, గోపాల్, వెంకటి, సామల తిరుపతి, విట్టయ్య భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.