18 August, 2026 | 7:25 PM

ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వన మహోత్సవం

18-08-2026 07:04 PM

బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని వాగ్దేవి కళాశాలలో మంగళవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రాజనాల శ్రీనివాస్ మాట్లాడుతూ... ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థులు నాటిన మొక్కలను రక్షించేది కృషి చేయాలి అన్నారు. చెట్ల వల్ల కలిగే లాభాలను పర్యావరణ పరిరక్షణ లో చెట్ల పాత్రను ప్రజల వివరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆవరణలో మొక్కలు నాటి వాటి ఎదుగుదలకు తమ వంతు కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు రాజేశ్వర్, హరీష్ ,ప్రశాంత్ లతోపాటు కళాశాల అధ్యాపకులు వాలంటీర్లు పాల్గొన్నారు.