3 August, 2026 | 2:29 PM

పాత బకాయిల కోసం తాగునీటి బోరు స్టార్టర్ తొలగింపు..

03-08-2026 01:35 PM

మర్రిమడ్లలో మాజీ సర్పంచ్ తనయుడి నిరసన

కోనరావుపేట, ఆగస్టు 3 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో గ్రామపంచాయతీ చెల్లించాల్సిన సుమారు రూ.1.30 లక్షల బకాయిలు అందకపోవడంతో 5వ వార్డు బస్టాండ్ సమీపంలోని తాగునీటి బోరు స్టార్టర్‌ను మాజీ సర్పంచ్ జింక పోషవ్వ కుమారుడు శ్రీనివాస్ తొలగించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, గతంలో గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సొంత నిధులతో బోర్లు వేయించానని తెలిపారు.అయితే ఆ పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ చెల్లించకపోవడంతో పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ స్పందన లేకపోవడంతో నిరసనగా బోరు స్టార్టర్‌ను తొలగించినట్లు చెప్పారు.ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశం తనకు లేదని, గ్రామపంచాయతీ తనకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు చర్చనీయాంశంగా మారింది.