3 August, 2026 | 2:10 PM

మంత్రి తుమ్మల ను కలిసిన యు/టి డిప్యూటీ కలెక్టర్

03-08-2026 01:40 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును(Minister Tummala Nageswara Rao) అండర్ ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్(UT Deputy Collector), దమ్మపేట మండల రెవెన్యూ అధికారిగా ఇంచార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న మద్దినేని మురళి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల డిప్యూటీ కలెక్టర్కు అభినందనలు తెలిపి, మండల ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను సకాలంలో ప్రజలకు అందేలా చూడాలని ఆదేశించారు.