దిగొస్తున్న పసిడి ధరలు
01-07-2026 12:32 AM
- హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర 1,40,130
- ఒక్కరోజులో 3 వేలు తగ్గుదల
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): మదుపర్లు పెద్ద ఎత్తున ఉన్న బంగారాన్ని విక్రయిస్తుండటం, దేశీయంగా బంగారంపై దిగుమతి సుంకాల సవరణ, అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తుండటంతో దేశీయంగా బంగారం ధరలు పడిపోతున్నాయి.
హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,020 పలుకగా, మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40, 130 దిగొచ్చింది. ఒక్కరోజులోనే రూ. 2,890కు తగ్గింది. కాగా పశ్చిమాసియాలో క్రమేణా పరిస్థితులు మెరుగుపడటం, రవాణా సౌకర్యాలు వేగవంతం కావడం కూడా బంగారం ధరల తగ్గేందుకు కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.






