22 April, 2026 | 1:32 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

చంద్రప్రభ వాహనంపై ఊరేగిన భద్రకాళి అమ్మవారు

22-04-2026 12:00 AM

వరంగల్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 4 గంటలకు నిత్యాహ్నికం నిర్వహించి చతుస్థానార్చన జరిపి అమ్మవారిని ఉదయం మకర వాహనం, సాయంకాలం చంద్రప్రభ వాహనం పై ఊరేగింపు జరిపారు.

భవసాగరంలో కొట్టుమిట్టాడుతున్న జీవులను కోరికలు పట్టి పీడిస్తూంటాయని మకర వాహనం మీద సేవిపంబడుతున్న అమ్మవారిని దర్శించడం వల్ల ఈ సంసార సాగరం నుండి తరింపబడతామని అలాగే మన మనస్సును ప్రేరేపిస్తాడు చంద్రుడు. చల్లదనానికి ప్రతీక చంద్రుడు. చంద్రప్రభవాహనం మీద సేవింపబడుతున్న అమ్మవారిని దర్శించడం వల్ల మనస్సుకు స్వాంతన లభిస్తుంది. స్వాంతచిత్తుడైన జీవుడికి సాధనలో సంపత్తి కలిగి ఇహపర సౌఖ్యాలతో వర్ధిల్లుతాడని ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు తెలిపారు.

శంకర జయంతి సందర్భముగా ఉదయం ఉషకాలార్చన పూర్తయిన అనంతరం జగద్గురు శంకరాచార్య జయంతిని ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఈ. ఓ రామల సునీత, ధర్మకర్తలు మయూరి రామేశ్వర్రావు, ఓరుగంటి పూర్ణచందర్, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, నాగుర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కార్యక్రమాలకు ఉభయదాతలుగా హనుమకొండ జిల్లా నాయీ బ్రాహ్మణ సంఘం వారు వ్యవహరించారు.