22 April, 2026 | 2:53 PM

Breaking News

కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల రెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •  

జనగణనకు అందరూ సహకరించాలి

22-04-2026 12:00 AM

అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్

మహబూబా బాద్, ఏప్రిల్21 (విజయక్రాంతి): జనగణన 2027 కార్యక్రమం అమలకు ప్రజలు సహకరించాలని మహబూబాబాద్ జిల్లా అదన కలెక్టర్ కే.అనిల్ కుమార్ కోరారు. జన గణన కార్యక్రమంలో భాగంగా, మొదటి దశలో గృహ గణన, గృహ పరిస్థితుల లెక్కింపు వచ్చే నెల11నుండి జూన్ 09 వరకు నిర్వహిస్తామని, దీనికి ముందు, ప్రజలకు సౌలభ్యం కల్పించేందుకు స్వీయ గణన సదుపాయం https://se.census.gov.in వెబ్ పోర్టల్ ద్వారా ఈనెల 26 నుండి వచ్చే నెల 10 వరకు అందుబాటులో ఉంచబడిందని, జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని, తమ గృహ, కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా ఇంటి సభ్యుల వివరాలను స్వయంగా నమోదు చేసుకోవడానికి ఇది సులభమైన, వేగవంతమైన విధానం అని మొబైల్ ఫోన్, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఏ పరికరం ద్వారా నైనా నమోదు చేసుకోవచ్చన్నారు. నమోదు పూర్తయిన తర్వాత, ఒక యూనిక్ కోడ్ పొందవచ్చని దీన్ని తరువాత గణనాధికారికి చూపించాలన్నారు.

స్వీయ లెక్కింపులో పాల్గొనడం ద్వారా గణన ప్రక్రియ వేగవంతం చేయడంలో సహకరించిన వారవుతారని, జిల్లాలోని ప్రజాప్రతి నిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత, మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, బ్యాంకు ఉద్యోగులు, ఐటీ రంగ ఉద్యోగులు, ఇతర వర్గాల వారు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.