ఎస్‌ఐ నుండి, ఎస్పీ డీసీపీ స్థాయి వరకు ఆ భగవంతుడు అవకాశం కల్పించాడు
- గద్వాల జిల్లా ఎస్పీ గా, డీసీపీగా పదవిరమణ, ఆత్మీయ సమ్మేళన సభలో మిత్రులు,కుటుంబ సభ్యుల సంతృప్తి
- డీసీపీ రంజన్ రత్నకుమార్
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 29(విజయ క్రాంతి): ఎల్లారెడ్డి పట్టణము కు చెందిన రంజన్ రత్నకుమార్,పదవిరమణ ఆత్మీయ సమ్మేళన సమావేశంలో డిసిసి రంజన్ రత్నకుమార్ ను తన బాల్య మిత్రులు, కుటుంబ సభ్యులు మిత్రులు శ్రేయోభిలాషులు,ఆయన నిర్వహించిన విధుల పట్ల,తన చిన్న కుటుంబ నుండి డిసిసి స్థాయి కి ఎదిగిన వ్యక్తి అని తన తోటి మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.పదవిరమణ ఆత్మీయ సమ్మేళన సభలో డిసిసి రంజన్ రత్నకుమార్ పదవిరమణ ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన మాట్లాడుతూ,నేను మారుమూల గ్రామంలో పుట్టి,పోలీస్ ఉద్యోగం చేయాలని గట్టి సంకల్పం తో ఉన్నత స్థాయికి ఎదిగి నా విధి నిర్వహణలో,నేను నిర్వహించిన విధులు,నేను ఎదుర్కున్న సమస్యలు,నా ఉద్యోగం నాకు స్ఫూర్తిని ఇచ్చిందని గర్వపడ్డారు.
నాకు,నా కుటుంబ సభ్యులు నాకు సహకరించడం వల్ల 37, సంవత్సరాల సర్వీస్ విధులు నిర్వహించానాని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమంలో,నా విధులను ప్రెండ్లిగా ఎంతో మంది విద్యార్థులకు నా వంతుగా సహాయం చేశానని,దృడ నిచ్చయం తో విధులు నిర్వహించానని,తన సర్వీస్ లో నిర్వహించిన విధులను,గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో,రొడ్డ, ప్రభాకర్, సంగారెడ్డీ అడిషనల్ ఎస్పీ సంజీవ రావు,తనతోటి,మిత్రులు, కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.






