24 June, 2026 | 4:54 PM

కోల్‌కతాలో ఘోర ప్రమాదం... కుప్పకూలిన గోదాం పైకప్పు

24-06-2026 03:50 PM

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్(West Bengal) రాష్ట్రం కోల్‌కతాలోని తారతలా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గోదాం పైకప్పు(Roof collapses) బుధవారం కూలిపోవడంతో, కనీసం 40 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. గోడౌన్‌ కుప్పకూలిన ఘటనలో ఎనిమిది మంది కార్మికులు మరణించినట్లు సమాచారం. మూడు అంతస్తుల భవనంలోని గిడ్డంగిలో పలువురు కార్మికులు నిర్మాణ పనులు చేస్తుండగా దాని పైకప్పు కూలిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం, పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ రంగంలోకి దిగాయి. సైన్యాన్ని కూడా పిలిచారు. అందరూ గాలింపు, సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నారు. రక్షణ చర్యలు కొనసాగుతుండగా, ఇప్పటివరకు కొందరిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.