భావితరాలకు దిక్సుచి ఉపాధ్యాయులు
జగదేవపూర్, (విజయక్రాంతి): జగదేవపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యామ్ సుందర్ రావు పదవి విరమణ కార్యక్రమం అంగ రంగా వైభవంగా నిర్వాహంచారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆర్యా వైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కాల్వ సుజాత, మాజీ ఎమ్మెల్యే నర్సా రెడ్డి లు హాజరై ప్రసంగించారు. ఉపాధ్యాయ వృత్తి అంటే సదా సిదా ఉద్యోగం కాదని చీకటి కమ్మిన జీవితాల్లో అక్షర మాలికల రూపం లో వెలుగులు నింపే దేవుళ్ళు అని కొనియాడారు. ఉపాధ్యాయులు లేకుంటే లాయర్లు, ఇంజనేర్లు, పోలీసులు, డాక్టర్ లు ఎవరు లేరని పేర్కొన్నారు. భావితరాలకు మార్గ దర్శులు ఉపాధ్యాయులు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా,ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి,జగదేపూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్,ఎంఇవో సైదులు,పిఆర్టియు మండల అధ్యక్షులు వెంకట్రామ్ రెడ్డి, మాజీ కొండ పోచమ్మ చైర్మన్ అనుగీత వివిధ సంఘాల నాయకులు, ఉపధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






