ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర
24-06-2026 03:33 PM
ఓటు హక్కు లేకపోతే పౌరసత్వం పోతుంది
వైరా: ఖమ్మం జిల్లా వైరాలో రైతు ఆశీర్వాద సభ సన్నాహక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని వివరించారు. నియోజకవర్గంలోని ఓటర్ల లిస్టును ఏఐకి ఇచ్చి విశ్లేషిస్తున్నారని తెలిపారు. బీజేపీకి అనుకూలంగా లేని ఓట్లను తొలగిస్తారని హెచ్చరించారు. మతం ఆధారంగా పేర్లు గుర్తించి తొలగిస్తారని ఆరోపించారు. ఓటు హక్కు లేకపోతే పౌరసత్వం కూడా పోతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మీ ఓటు లిస్ట్ లో లేకపోతే 2025 నాటి మ్యాపింగ్ చూపించాలని తెలిపారు. మన ఓట్లు పోకుండా మనమే జాగ్రత్త పడాలని కోరారు.






