24 June, 2026 | 4:34 PM

ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా మహేశ్వర్ రెడ్డి

24-06-2026 03:09 PM

సిద్దిపేట రూరల్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

ఉపాధ్యక్షుడిగా రంజిత్ కుమార్ ఎంపిక..

సిద్దిపేట రూరల్, జూన్ 24: సిద్దిపేట రూరల్ మండల ఉప సర్పంచ్ ఫోరం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిన్నగుండవెల్లి గ్రామ ఉప సర్పంచ్ గడీల మహేశ్వర్ రెడ్డిని అధ్యక్షుడిగా, బండచర్లపల్లి గ్రామ ఉప సర్పంచ్ బేల రంజిత్ కుమార్‌ను ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ప్రధాన కార్యదర్శిగా అల్లం సాయి చరణ్, కార్యదర్శిగా తోటకుంట నాగలక్ష్మిని ఎన్నుకున్నారు.

కమిటీ సభ్యులుగా శివయ్య, దుర్గం అను ప్రమీల, ఒగ్గు రాజేష్‌తో పాటు పలువురు ఉప సర్పంచ్‌లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు ఉప సర్పంచ్‌లు శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతానికి సమిష్టిగా కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. ఉప సర్పంచ్‌ల హక్కుల పరిరక్షణతో పాటు గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.