4 May, 2026 | 12:35 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

బాధితుడి వద్దకే వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు

06-03-2026 02:24 AM

మహబూబాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని స్థితిలో ఉ న్న బాధితుడి వద్దకే వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఘటన బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం మధ్యాహ్నం బ య్యారం గ్రామానికి చెందిన రాయల సతీష్ అనే వ్యక్తి గాయపడిన కారణంగా పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు.ఈ విషయం తెలుసుకున్న వెంటనే బయ్యారం ఎస్‌ఐ కొగిల తిరుపతి సంఘటన స్థలానికి స్వయంగా వెళ్లి బాధితుడిని ప రామర్శించి, అతని నుంచి ఫిర్యాదు స్వీకరించారు.

బాధితుడి పరిస్థితిని దృష్టిలో ఉం చు కుని న్యాయం ఆలస్యం కాకూడదనే ఉద్దేశం తో ఘటన స్థలంలోనే ఆన్ సైట్ ఎఫ్‌ఐఆర్ ను బీఎన్‌ఎస్ చట్టం ద్వారా నమోదు చేసి ఈ కేసు నమోదుచేశారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నా కూడా ప్రజ లు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, ప్రజల భద్రత కోసం మహబూబాబాద్ జిల్లా పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోంది.  ఈ ఘటన పోలీసులు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారో, ప్రజల సమస్యలను బాధ్యతగా తీసుకుంటారో చూపించే మంచి ఉదాహరణగా నిలిచింది.