7 March, 2026 | 9:35 AM

బీజేపీ రెబల్స్ ఆందోళన

06-03-2026 02:23 AM
  1. జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటిపై దాడి
  2. ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్ ధ్వంసం
  3. ఎంపీ అరవింద్ ప్రెస్‌మీట్‌కు ముందు ఉద్రిక్తత
  4. ఆందోళకారుల అరెస్టు

జగిత్యాల, మార్చి 5 (విజయక్రాంతి): జగిత్యాలలో గురువారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన కొంతమం ది నాయకులు ఆమె నివాసానికి చేరుకుని హంగా మా సృష్టించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ మీడియా సమావేశం కోసం ఇంటి ముందు ఏర్పా టు చేసిన కుర్చీలు, టెంట్‌ను ధ్వంసం చేశారు. శ్రావ ణి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ దాడికి యత్నించినట్లు తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీ సులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.