22 August, 2026 | 3:22 AM

జీవో 4779 రద్దు చేసి ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి

22-08-2026 01:43 AM

గట్టు, ఆగస్టు 21: విబిజీ రాంజీ పథకంలో గతంలో విధులు నిర్వహించిన ఫీల్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఫీల్ అసిస్టెంట్లు ఆరగిద్ద తిమ్మప్ప, ప్రభాకర్, నారాయణ డిమాండ్ చేశారు. ఫీల్ అసిస్టెంట్ల తొలగింపునకు సంబంధించిన జీవో 4779ను రద్దు చేసి, లిస్ట్-3లో ఉన్న ఫీల్ అసిస్టెంట్లందరికీ తిరిగి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం  గట్టు ఎంపీడీవో చెన్నయ్య, ఏపీవో స్వామికి వినతిపత్రం సమర్పించారు.