calender_icon.png 10 February, 2026 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధారి మండల టీపీటీఎఫ్ అధ్యక్షుడిగా జ్ఞానేశ్వర్

10-02-2026 12:42:29 AM

గాంధారి, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం గాంధారి మండల కేంద్రంలో టిపిటిఎఫ్ సమావేశం ఏర్పా టు చేశారు.ఈ సమావేశంలో గాంధారి మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. టిపిటిఎఫ్ మండల అధ్యక్షుడిగా జ్ఞానేశ్వర్ ని ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు.

ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం, అంజయ్య,నరేందర్ సాయిలు, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో మండల అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ టిపిటి ఎఫ్ భావజాలాలు, పనితీరు నచ్చి నేను టిపిటిఎఫ్‌లో చేరినట్లు తెలిపారు. ఫెడరేషన్ కి కట్టుబడి ఉంటూ సంఘ సేవ చేస్తానని  పేర్కొన్నారు.