10-02-2026 12:42:46 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు కాంగ్రెస్ అవినీతి, అరాచక పాలనకు చెంప పెట్టు కావాలని, ఈ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు ద్వారా అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని, “సేవ్ తెలంగాణ...ఓట్ ఫర్ బీజేపీ”అనే బీజేపీ నినాదానికి అనుగుణంగా కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు.
ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పాలనలో ఏం చేసారో, గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా, తిట్ల దండకాలు, తప్పుడు హామీలు, కుమ్మక్కు రాజకీయాలతో ప్రజలను మోసపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ను నమ్మితే అధో: గతేనని, తెలంగాణ అభివృద్ధి కావాలంటే, మున్సిపాలిటీల్లో నిజమైన పాలన రావాలంటే, అవినీతి రహిత పరిపాలన కావాలంటే.. కమలం గుర్తుకు ఓటు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరారు.