28 June, 2026 | 2:22 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

గిరిజన మార్టు అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇవ్వండి

16-03-2026 12:00 AM

వ్యాపారస్తులను కోరిన ఐటీడీఏ పీవో రాహుల్ 

భద్రాచలం, మార్చి 15, (విజయక్రాంతి): ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ప్రత్యేక శ్రద్ధ మరియ ఎస్ హెచ్ జి గ్రూప్ మహిళలు చిన్న తరహా పరిశ్రమలు నడుపుకునే గిరిజన కుటుంబాలకు ఆర్థిక చేకూర్పు చేయడానికి ప్రారంభిస్తున్న భద్రగిరి మార్ట్కు భద్రాచలం పట్టణంలోని వ్యాపారస్తులు సలహాలు సూచనలు అందించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు.

ఆదివారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో భద్రాచలం పట్టణంలోని ప్రముఖ వ్యాపారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై భద్రగిరి మార్ట్‌లో ప్రజలకు కావలసిన నిత్యవసర సరుకులకు సంబంధించిన సరుకుల జాబితాను అందించాలని అన్నారు.

ఇప్పటివరకు ఎస్ సి హెచ్ జి మహిళలు తయారు చేసే వివిధ రకాల ఆహార పదార్థాలకు సంబంధించిన నిత్యవసర సరుకులు అలాగే గిరిజన రైతులు పండించే వివిధ రకాల బియ్యం మరియు పప్పు దినుసులను పరిశీలించడం జరిగిందని, వీటితోపాటు ప్రస్తుతం మార్కెట్లో ప్రజలు ఎక్కువ శాతం కొనుగోలు చేసే నిత్యవసర సరుకులు నాణ్యత మరియు మన్నికైన వాటికి సంబంధించిన సరసమైన ధరల జాబితాను అందించి శ్రీరామనవమికి ప్రారంభించబోయే భద్రగిరి మార్ట్ దిగ్విజయంగా నడిచేలా సహకరించాలని వ్యాపారస్తులకు సూచించారు.  ఈ కార్యక్రమంలో ఏపీవో పవర్ వేణు, డీఎస్‌ఓ ప్రభాకర్ రావు, మేనేజర్ ఆదినారాయణ మరియు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.