24-02-2026 12:00:00 AM
బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్
హనుమకొండ, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి):తెలంగాణ రాష్ట్రం నుండి మార్చి నెలలో భర్తీ జరిగే రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీసీకి, ఇంకోటి ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కులగనన జరగాలని కుల గణాంకాల ఆధారంగా జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కలన్న రాహుల్ గాంధీ యొక్క మాటలు దేశంలోని 90 కోట్ల మంది బహుజనులకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కూడా మీ మాట అమలు జరిగితేనే దేశమంతా మిమ్మల్ని విశ్వసిస్తుంది, ముఖ్యంగా మీరు అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేసే దిశగా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది, సామాజిక న్యాయము అమలే దేశంలో కాంగ్రెస్ పార్టీని అగ్ర భాగాన నిలబెడుతుంది.ఈ వాస్తవాన్ని మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నా, ప్రస్తుతం మార్చ్ నెలలో భర్తీ చేయబోయే రెండు రాజ్యసభ స్థానాలలో ఒకటి బీసీలకు ఇంకొకటి ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాo, రాజ్యసభ సీట్లు అగ్రకులాలకు కేటాయిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.
90 శాతం ఉన్న బహుజనుల గొంతు చట్టసభల్లో వినిపించదు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం సుదీర్ఘకాలంగా జీవితాంతం పనిచేస్తున్న వారు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అందులో అగ్రగన్యులుగా బీసీల పితామహుడుగా వి. హనుమంతరావు, తెలంగాణ కోసం పార్లమెంట్ లో గళం విప్పిన పోరాడిన మధు యాస్కి గౌడ్ లాంటి వాళ్ళు ముందు వరసలో ఉన్నారు. ఇలాంటి వారికి మీరు రాజ్యసభ అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీసీల విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నo.ని వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు.