ప్రభుత్వ భూమి వివరాలు ఇవ్వండి
01-04-2026 12:23 AM
ఆర్డీవోకు వికారాబాద్ కలెక్టర్ ఆదేశం
తాండూరు, మార్చి 31 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ‘100 కోట్ల ప్రభుత్వ భూమి హాంఫట్ ’ శీర్షికన ఈ నెల 26న విజయక్రాంతి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 111కు సంబంధించిన దస్తావేజులు రెండు రోజుల్లో ఇవ్వాలని తాండూర్ రెవిన్యూ డివిజన్ ఆఫీసర్‌ను ఆదేశించారు.
ఈ మేరకు ఆర్డిఓ అనిత విజయక్రాంతి కథనం క్లిప్పును జతచేసి తాసిల్దార్ తారా సింగ్ కు వివరణ ఇవ్వాలని పంపించినట్టు సమాచారం. పట్టణం నడిబొడ్డున ఉన్న ఆర్డీవో కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ప్రభుత్వ భూమిలో కబ్జాలు చేసి నిర్మాణాలు చేస్తున్న కూడా స్థానిక రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని కలెక్టర్ మండిపడ్డట్టు సమాచారం.




