‘గిఫ్ట్ హర్ క్లియర్ విజన్’
మహిళలకు ఉచిత కంటి పరీక్షలు అందించేందుకు ‘గిఫ్ట్ హర్ క్లియర్ విజన్’ ప్రచారాన్ని డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ వారు ప్రారంభించారు. ప్రతి మహిళకు కంటి పరీక్ష చేయించాలనే ప్రతిజ్ఞ చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలను ప్రోత్సహించే కార్యక్రమం ఇంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభించిన ఈ కార్యక్రమంలో నెల పొడవునా మహిళలకు ప్రత్యేక ఓపీ కన్సల్టేషన్ సౌకర్యం కల్పించారు.
డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ దేశవ్యాప్తంగా మహిళలకు ఉచిత కంటి పరీక్షలు మరియు కన్సల్టేషన్లు అందించేందుకు ‘గిఫ్ట్ హర్ క్లియర్ విజన్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలోని 280కి పైగా ఐ హాస్పిటల్స్, విజన్ కేర్ సెంటర్ల ద్వారా సుమారు పది లక్షల మహిళలకు ఉచిత కంటి పరీక్షలు అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన.
ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ముఖ్యమైన మహిళకు ఉచిత కంటి పరీక్ష చేయించేందుకు ప్రతిజ్ఞ చేయాలని ఆసుపత్రి కోరుతోంది. ఇందుకోసం https://www.dragarwal.com/womens-day-2026/ వెబ్‌సైట్‌లో ఉన్న సులభమైన 30 సెకన్ల ప్రతిజ్ఞ ఫారాన్ని పూరించడం ద్వారా డిజిటల్‌గా పాల్గొనవచ్చు. లేదా 9003888444 నంబర్కు కాల్ చేసి ఉచిత కంటి పరీక్ష కోసం ఒక మహిళను నామినేట్ చేయవచ్చు. మార్చి 8 నుంచి 31, 2026 మధ్య ప్రాధాన్యతతో ఉచిత కంటి పరీక్ష అపాయింట్మెంట్ను బుక్ చేస్తారు.
కంటిచూపు సమస్యలను అడ్డుకోవచ్చు
డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్, గచ్చిబౌలి (హైదరాబాద్) ప్రాంతీయ క్లినికల్ సేవల అధిపతి డా. ప్రీతి ఎస్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా మహిళలకు ఉచిత సమగ్ర కంటి పరీక్షలు మరియు క్లినికల్ కన్సల్టేషన్లను అందిస్తున్నాం. ముందస్తుగా మరియు నిరంతరం కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా నివారించగలిగే చూపు సమస్యలను అడ్డుకోవచ్చు.
సరైన సమయంలో వ్యాధులను గుర్తించి తగిన చికిత్స అందించడానికి ఇది ఎంతో కీలకం, అని తెలిపారు. వారాంతాల్లోనే కాకుండా వారంవిడత రోజులలో కూడా మహిళల కోసం ప్రత్యేక కన్సల్టేషన్ సమయాలను ఆసుపత్రి కేటాయించింది. నామినేట్ చేయబడిన మహిళలకు త్వరితగతిన చెక్-ఇన్ సౌకర్యం కల్పించడంతో పాటు ఆదివారాల్లో ప్రైవేట్ కన్సల్టేషన్ గదుల సదుపాయం కూడా ఉంటుంది.




