వసతి గృహాలకు గ్యాస్ సరఫరా పకడ్బందీగా సాగాలి
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, మార్చి 20 (విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలకు గ్యాస్ సిలిండ ర్ల సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా పకడ్బందీగా కొనసాగాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో అందుబాటులో ఉన్న గ్యాస్ సిలిండర్ల స్టాక్ వివరాలను కలెక్టర్ సమీక్షించారు.
గ్యాస్ ఏజెన్సీలు వసతి గృహాల అవసరాలకు అనుగుణంగా సమయానికి సరఫరా చేయాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో అదన పు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, డీఈఓ భోజన్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల అధికారులు దయానంద్, అంబాజీ, శ్రీనివాస్, మోహన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.




