11 May, 2026 | 1:29 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా గరీమా అగ్రవాల్

26-02-2026 11:37 AM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా గరీమా అగ్రవాల్(Garima Agrawal) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం జీవో ఆర్టీ నంబర్ 290 ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి అయిన గరీమా అగర్వాల్, ప్రస్తుతం జిల్లా అదనపు కలెక్టర్‌గా స్థానిక సంస్థలు విధులను నిర్వహిస్తున్నారు.

గత కొంతకాలంగా ఆమె జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ప్రభుత్వం ఇప్పుడు ఆమెను పూర్తిస్థాయి కలెక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా యంత్రాంగంపై ఇప్పటికే మంచి పట్టున్న గరీమా అగర్వాల్ నియామకం పట్ల స్థానిక అధికారులు ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఇన్ఛార్జ్ కలెక్టర్‌గా జిల్లాలోని అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె చురుకైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనుండటంతో జిల్లా మరింత ప్రగతి పథంలో పయనిస్తుందని భావిస్తున్నారు.