1.53 కోట్ల గంజాయి స్వాధీనం
22-06-2026 12:56 AM
కామారెడ్డి, జూన్ 21 (విజయక్రాంతి): కామారెడ్డిలో రూ.1.53 కోట్ల విలువ చేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.. ఎస్పీ రాజేష్‌చంద్ర వివరాలు వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్ వైపు నుంచి ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌కు బత్తాయి పండ్ల లోడుతో వెళ్తు న్న లారీలో 387.12 కిలోల గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు క్యాసంపల్లి శివారులో జాతీయ రహదారిపై కామారెడ్డి పోలీసులు తనిఖీ లు చేశారు. అనుమానాస్పద లారీని తనిఖీ చేయ గా కిలోల గంజాయి లభ్యమైంది.






