calender_icon.png 23 February, 2026 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గేమ్‌ఛేంజర్ ఏఐ సమ్మిట్

23-02-2026 02:08:27 AM

సదస్సు ప్రపంచ గమనాన్ని మారుస్తుంది

డిజిటల్ అరెస్ట్, ఆన్లైన్ ఆర్థిక మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఏఐ వేదిక వద్ద కాంగ్రెస్ మురికి రాజకీయాలు

హోలీ పండుగకు స్వదేశీ వస్తువులనే వాడండి

మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 : భారత్‌లో జరిగిన అంతర్జాతీయ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రపంచ సాంకేతిక రంగంలో ఒక కీలక మలుపు అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం తన 131వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సమ్మిట్‌లో ప్రదర్శించిన భారతీయ ఆవిష్కరణలు ప్రపంచ నాయకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు.

ముఖ్యంగా ప శువుల ఆరోగ్యం, పాడి పరిశ్రమ పర్యవేక్షణలో ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్న తీరును ప్రధాని ప్రశంసించారు. అమూల్ బూత్‌లో ఏర్పాటు చేసిన ఏఐ అసిస్టెంట్ ద్వారా రైతులు తమ పశువులను 24 గంట ల పాటు ఎలా కనిపెట్టుకోవచ్చో విదేశీ ప్రతినిధులు ఆశ్చర్యంతో చూశారని తెలిపారు. భారతీయ సంస్కృతిని, ప్రాచీన గ్రంథాలను కాపాడుకోవడంలో కూడా ఏఐ పాత్రను ప్రధాని వివరించారు. సుశ్రుత సంహిత వం టి ప్రాచీన ప్రతులను డిజిటలైజ్ చేసి నేటి తరానికి అందుబాటులోకి తెస్తున్న విధానాన్ని సమ్మిట్లో ప్రదర్శించినట్లు చెప్పారు.

అలాగే డిజిటల్ అరెస్ట్, ఆన్లైన్ ఆర్థిక మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బ్యాంక్ కేవైసీ అప్‌డేట్ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని, అపరిచితులకు వ్యక్తిగత వివరాలు వెల్లడించవద్దని సూచించారు. హోలీ పండుగ సందర్భంగా విదేశీ వస్తువులను కాకుండా స్వదేశీ వస్తువులనే వాడాలని ‘ఓకల్ ఫర్ లోకల్’ నినాదాన్ని మరోసారి గుర్తుచేశారు. అదే సమయంలో ఏఐ సమ్మిట్ వేదికగా కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన నిరసనలపై ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు.

మీరట్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, విదేశీ ప్రతినిధుల ముందు కాంగ్రెస్ ‘అర్ధనగ్న రాజకీయా లు’ చేస్తోందని విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను దిగజార్చేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, మురికి రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ విజయాలను కాంగ్రెస్ జీర్ణించుకోలేకపో తోం దని ఎద్దేవా చేశారు. భారత్ సాధిస్తున్న ప్రగతిని ప్రపంచమంతా గమనిస్తోందని ప్ర ధాని స్పష్టం చేశా రు.

కేరళకు చెందిన పది నెలల చిన్నారి అలిన్ షెరిన్ అబ్రహం అవయవ దానం గురించి మోదీ భావోద్వేగం తో మాట్లాడారు. అతి చిన్న వయసులోనే ఆ చిన్నారి ఐదుగురికి పునర్జన్మ ప్రసాదించిందని కొనియా డారు. ఆమె తల్లిదండ్రుల నిర్ణయం దేశానికే స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. టీ20 వరల్డ్ కప్‌లో ఆడుతున్న భారత సంతతి ఆటగాళ్ల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఏ దేశం తరఫున ఆడినా భారత సంతతి వారు తమ మూలాలను మర్చిపోకుండా రాణించడం గర్వకార ణమని ప్రధాని మోదీ అన్నారు.