12 August, 2026 | 2:42 AM

గజ గొప్ప విజయం సాధించాలి

12-08-2026 01:13 AM

సతీశ్ జై, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రల్లో డాక్టర్ మైత్రి శరణ్ నిర్మించిన చిత్రం ‘గజ’. ఈ సినిమాకు సతీశ్ జై దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మైత్రి మూవీస్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు నటుడు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో  మనోజ్ మాట్లాడుతూ.. “సతీశ్ జై హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ధైర్యం చేసి అడుగు ముందుకు వేశారు. చాలా మందికి అలాంటి ధైర్యం ఉండదు.

ఇండస్ట్రీకి కులం, గోత్రం లేదు. కళామతల్లికి కులం, మతం లేదు. చిన్నా, పెద్దా, కొత్త, పాత అన్న తేడా లేకుండా కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ బ్రహ్మరథం పడతారు. ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు. హీరో, దర్శకుడు సతీశ్ జై మాట్లాడుతూ.. “సినిమా అదిరిపోద్ది” అని తెలిపారు. ఫెర్నాజ్ శెట్టి, నిర్మాత మైత్రి శరణ్, చిత్ర సమర్పకుడు చలమలశెట్టి సునీల్, సెవెన్ హిల్స్ సతీశ్, కో ప్రొడ్యూసర్లు మిట్టపల్లి సురేందర్, మధుసూదన్, పద్మనాభరెడ్డి, కెమెరామెన్ జగదీశ్ చీకటి కూడా మాట్లాడారు.