10 August, 2026 | 1:31 AM

గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

10-08-2026 12:13 AM

తాడ్వాయి, ఆగష్టు, 9( విజయ క్రాంతి ): గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావును  తాడ్వాయి మండలం కన్కల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యేను కలిసి వారు వినతిపత్రం అందించారు.గ్రామంలో ప్రధానంగా పైపులైన్, సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గడ్డం ప్రతాప్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి పెంటారెడ్డి తదితరులు  పాల్గొన్నారు.