calender_icon.png 18 February, 2026 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె నుంచి పట్నం దాకా బీసీలదే సత్తా

18-02-2026 12:00:00 AM

62 శాతం మున్సిపల్ పీఠాలు కైవసం

బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామాజిక రాజకీయ సునామీ కొనసాగుతోందని, పల్లెల్లోనే కాకుండా పట్టణాల్లోనూ బీసీలు తమ రాజకీయ సత్తా చాటారని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీసీలకు ఏకంగా 62 శాతం పదవులు దక్కడం బీసీల సుదీర్ఘ పోరాట ఫలితమేనని ఆయన అభివర్ణించారు.

మంగళవారం హైదరాబాద్‌లోని బీసీ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో జరిగి న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పం చులుగా 53 శాతం మంది బీసీలు ఎన్నిక కాగా, మున్సిపల్ ఎన్నికల్లో ఆ సంఖ్య 61 శాతానికి పెరగడం బీసీలలో పెరుగుతున్న రాజకీయ చైతన్యానికి నిదర్శ నమని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ల ద్వారా, మరో 31 జనరల్ స్థానాల్లోనూ బీసీలు చైర్మన్లుగా గెలుపొందడం చారిత్రాత్మక విజయం అన్నా రు.

మొత్తం 66 మంది బీసీలు చైర్మన్ పీఠాలను అలంకరించారని, ఇందులో కాంగ్రెస్ నుండి 52 మంది, బీఆర్‌ఎస్ నుండి 11 మంది, బీజేపీ నుండి ఒకరు ఇతరులు ఇద్దరు ఉన్నారని ఆయన వివరించారు. బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పించిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలకు జాజుల శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా నిజామాబాద్ మేయర్ వంటి జనరల్ స్థానంలో బీసీ మహిళకు అవకాశం కల్పించిన పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్‌పై ప్రశంసలు కురిపించారు.

సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో 18 మున్సిపల్ పీఠాలకు గాను 16 స్థానాలను బీసీలకే కేటాయించడం హర్షనీయమన్నారు. అయితే ఖమ్మం జిల్లాలో మా త్రం మంత్రులు బీసీ రిజర్వేషన్ ఉన్న ఇల్లం దు మినహా మిగిలిన అన్ని చోట్లా అగ్రకులాలకే పెద్దపీట వేయడం బాధాకరమని విమ ర్శించారు. తాము ఎన్నడూ ఓసీలను కించపరచలేదని, కేవలం బీసీల వాటాను మాత్రమే డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

జనరల్ స్థానాలు అంటే అవి కేవలంరెడ్డి, రావులకు రిజర్వ్ చేసిన స్థానాలు కావు.. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కూడా సమాన హక్కు ఉం టుంది అని ఆయన ఉద్ఘాటించారు. ఎన్ని ఎన్నికలు నిర్వహించినా, 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదని జాజుల స్పష్టం చేశారు.