మంచినీటి పైప్ లైన్ లీకేజీ సమస్య పరిష్కారం
మరమ్మత్తులు చేయించిన కౌన్సిలర్ పల్లగోల్ల విజయలక్ష్మి అశోక్ యాదవ్
మొయినాబాద్,(విజయక్రాంతి): గత రెండు మూడు రోజుల నుండి మంచినీటి పైప్ లైన్ లీకేజీ అయ్యి రోడ్డుపై నీరు వృధాగా పారుతూ... ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విషయం తెలుసుకున్న 10వ వార్డు కౌన్సిలర్ పల్లగోల్ల విజయలక్ష్మి అశోక్ యాదవ్ వెంటనే స్వయంగా పరిశీలించి, మున్సిపల్ సిబ్బందితో వెంటనే మరమ్మత్తులు చేయించి సమస్యను పరిష్కరించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ పల్లగొల్ల విజయలక్ష్మి అశోక్ యాదవ్ మాట్లాడుతూ... వార్డులో మంచినీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతామని అన్నారు. వార్డు ప్రజలకు మంచినీటి సౌకర్యంతో పాటు స్తంభాలకు విద్యుత్ దీపాలు మురికి కాలువ శుభ్రం చేయుట కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.




