7 June, 2026 | 4:36 PM

వేములవాడ భీమేశ్వర స్వామిని దర్శించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే

07-06-2026 03:10 PM

సిరిసిల్ల,(విజయక్రాంతి): దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే శంకర్  స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కోడె మొక్కులు చెల్లించుకున్నారు, అనంతరం వచ్చిన ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా  తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ ఈవోలు జి.శ్రావణ్ కుమార్, జి. అశోక్ కుమార్ స్వామివారి శేషవస్త్రం అందజేశారు. ఈ ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని,

తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ క్షేత్రం ఆధ్యాత్మిక వైభవానికి నిలయంగా నిలుస్తోంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటుండటం ఆలయ మహిమకు నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు, వేద పండితులు  పాల్గొన్నారు.