21 March, 2026 | 3:49 AM

ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం విజయవంతం

21-03-2026 12:30 AM

బూర్గంపాడు, మార్చి20, (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్ బొర్రా సుభద్ర ప్రారంభించారు. వైద్య శిబిరంలో మొత్తం 413 మంది వివిధ అనారోగ్య సమస్యలు ఉన్న వారు పరీక్షలు చేయించుకున్నారు.

స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ సాగరిక, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక , కంటివైద్య నిపుణులు డాక్టర్ రాజేష్, ఎముకలు, కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ క్రాంతి కుమార్, దంత వైద్య నిపుణులు డాక్టర్ అమరేందర్ రెడ్డి , సాధారణ వైద్య నిపుణులు డాక్టర్ స్నేహ వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ స్పందన, పిహెచ్సి డాక్టర్ పావని, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.