2 July, 2026 | 4:43 PM

Breaking News

చెట్టే శాపమైందా..? ఇందిరమ్మ మోడల్ హౌస్‌కు పగుళ్లు   •   బహిరంగ చర్చకు వెనక్కి తగ్గింది కాంగ్రెస్ ప్రభుత్వమే: సిలివేరి సత్యనారాయణ   •   ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •  

ఉచిత వైద్య శిబిరాలతో ప్రజలకు మేలు

03-02-2026 12:13 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఫిబ్రవరి 2: ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని సర్పంచ్ నున్న యాదగిరి అన్నారు.మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో సోమవారం నార్కట్ పల్లి కామినేని హాస్పిటల్ వారు ఉచిత హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులను అందజేశారు.అనంతరం సర్పంచ్ యాదగిరి మాట్లాడుతూ కామినేని హాస్పిటల్ వారి సేవలు అభినందనీయమని,ప్రతీ ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాండ్ర గోవర్ధన్,బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు తొడుసు వీరమల్లు,6వ వార్డు సభ్యుడు నున్న సురేష్ యాదవ్,ఆశా కార్యకర్త శోభ,గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.