గిరిజన గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరం
ప్రజల్లో భారీ స్పందన
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం పెంబి మండలం షెట్ పెళ్లి గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. నరసమ్మ చారిటబుల్ ట్రస్ట్, పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ నిర్వాహకులు, ఎలగందుల సాయి కృష్ణ, గూడూరు వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు. దీనికి పరిసర గ్రామాలు రామ్ గూడ, జంగుగూడ, సఖి గూడా, యాపాల్ గూడా, రామ్ నగర్ ,నాయక్ పోడ్ గూడా గ్రామాల ప్రజలకు వైద్యం అందించారు.
సుమారు 300 మందికి శిబిరం ద్వారా ఉచిత వైద్య సహాయం, మందులు అందజేశారు. ఈ శిబిరంలో నిర్మల్ పట్టణానికి చెందిన శ్రీ ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ,సాధన న్యూరో సెంటర్, మైత్రి హాస్పిటల్ ,దంత వైద్యులు నితీష్ రాజా, చిత్ర మిషన్ కంటి దవాఖాన కంటి వైద్య సహాయకురాలు చిత్రలతా రెడ్డిమల్ల లు వైద్య సహాయం అందించారు. కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ ఏం విటల్ ,ఎస్సై తదితరులు పాల్గొన్నారు.




