గోనెల విజయలక్ష్మికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోరం
టేకులపల్లి,(విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జిల్లా చైర్మన్ గోనెల విజయలక్ష్మి భౌతికయానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో నివాళులు అర్పించారు. గోనెల విజయలక్ష్మి అకాల మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా కోరం కనకయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన రాజకీయ గురువుగారైన దివంగత నేత గోనెల నారాయణ సతీమణి విజయలక్ష్మి జిల్లా ప్రజలకు అనేక సేవలు అందించారాని,
భర్తను, కొడుకును కోల్పోయినప్పటికి అనేక ఒడి దుడుకులను ఎదుర్కొని రాజకీయాల్లో అత్యునత స్థాయి జిల్లా పరిషత్ చైర్మన్ గా ప్రజలకు అంచించిన సేవలను స్మరిస్తూ తీవ్ర దిగ్బ్రాంతి చెందారు. గోనెల విజయలక్ష్మి భౌతికాయానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించించారు. అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం పాడే మోశారు. ఎమ్మెల్యేతో పాటు డీసిసి ప్రెసిడెంట్ తోట దేవి ప్రసన్న, ఎమ్మెల్యే సతీమణి కోరం లక్ష్మి గారు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ - ఉమా, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




