సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరం
* గంగిశెట్టి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు
చిగురుమామిడి,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా, చిగురు మామిడి మండలం, రేకొండ గ్రామంలో గంగిశెట్టి మధురమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మేగా వైద్య శిబిరం నిర్వహించామని ట్రస్ట్ ఫౌండర్ గంగిశెట్టి జగదీశ్వర్ తెలిపారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ అల్లేపు సంపత్ గారు ప్రారంభించి వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఈ శిబిరంలో శ్రీనివాస విజన్ సెంటర్ చిగురుమామిడి మరియు మెడికవర్ హాస్పిటల్ వారు 258 మందికి ఉచితంగా బిపి, షుగర్, ఈసిజీ, కంటి, వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమా వారికి ఉచితంగా మందులు, చుక్కల మందులు పంపిణీ, 29 మందికి కంట్లో పొరలు ఉన్నట్లు గుర్తించి వారికి ఉచిత కంటి ఆపరేషన్ చేపిస్తామని కంటి పరీక్ష నిపుణులు తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు. ఈ శిబిరానికి వచ్చిన వారికి భోజనం వసతి కూడా కల్పించామాని, అనంతరం డాక్టర్స్ కి మరియు సిబ్బంది కి శాలువాతో సత్కరించి ట్రస్ట్ మెమెంటో అందచేయండం జరిగింది. ఈ శిబిరంలో హాస్పిటల్ సిబ్బంది , కారోబర్ రాజు, గోపగొని తిరుపతి, సతీష్ , కార్తీక్ ,మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






