20 April, 2026 | 8:53 PM

Breaking News

చలో జగిత్యాల.. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలిన పీర్జాదిగూడ బీఆర్ఎస్ శ్రేణులు   •   ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   పెళ్లిరోజు... మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ   •   రైతుకు మద్దతు ధర కల్పించడమే ప్రధాన లక్ష్యం   •   ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచొద్దు   •   శిశుమందిర్ అభివృద్ధికి సహకరిస్తా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జారే   •   మధిర మండలంలో కుల బహిష్కరణ కలకలం   •   చిన్నారుల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం ముఖ్యం   •   ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కాయకల్ప నిపుణుల బృందం   •  

భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా లేబర్ కార్డులు పంపిణీ

18-12-2025 07:00 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): జీహెచ్ఎంసీ ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని అవుషాపూర్ లో గురువారం భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా లేబర్ కార్డులు పంపిణీ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఎంతో ప్రయోజకరంగా ఉండే ఈ లేబర్ కార్డులను వైయస్ రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న 200 మంది భవన నిర్మాణ కార్మికులకు ట్రస్టు వ్యవస్థాపకులు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చందర్ రెడ్డి చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు. మరో 250 మంది భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు కోసం అందజేసిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి దళిత మోర్చా జిల్లా నాయకులు కె. కరుణాకర్, పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.