13 August, 2026 | 3:07 AM

శారాజిపేటలో మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు..

13-08-2026 01:52 AM

ఆలేరు, ఆగస్టు 12: ఆలేరు మండలం శారాజిపేట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా అందించనున్న ఉచిత ఆరోగ్య పరీక్షలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలు ఆరోగ్య పరీక్షలను సద్వినియోగం చేసుకుని ముందస్తుగా ఆరోగ్య సమస్యలను గుర్తించి తగిన వైద్యం పొందాలని సూచించారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ  కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.