26 May, 2026 | 4:21 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

22-12-2025 09:24 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ దండే విఠల్, యువసేన వ్యవస్థాపక  అధ్యక్షుడు సామల రాజన్న ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్సీ దండే విఠల్ పుట్టినరోజు సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు దండ విట్టల్ యువసేన  అధ్యక్షుడు సామల రాజన్న తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 106 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, 12 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.

24 మందికి ఆపరేషన్ అవసరమని, 17 మందికి లెన్స్ తో కూడిన అద్దాలు అందిస్తామని తెలిపారు. వైద్య పరికరాల  ద్వారా కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాచకొండ శ్రీ వర్ధన్, మాజీ జెడ్పిటిసి పంద్రం పుష్పలత, నాయకులు జగ్గ గౌడ్, రంగు సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.