23-02-2026 06:17:27 PM
- హుజూర్ నగర్ సీఐ చరమందరాజు
హుజూర్‌నగర్: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని టౌన్ హాల్ లో ఈనెల 25న అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమంలో హుజూర్‌నగర్ సర్కిల్ పరిధిలోని లైసెన్స్ డ్రైవర్లకు ఉచితంగా కంటి వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ చరమందరాజు తెలిపారు. సోమవారం పట్టణంలోని సీఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సర్కిల్ పరిధిలోని సిమెంట్ పరిశ్రమల ట్రాన్స్ పోర్ట్, లారీ అసోసియేషన్, ఆటో డ్రైవర్లు,
స్కూల్ బస్, క్యాబ్ డ్రైవర్లుకు ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన సీనియర్ కంటి వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమగు వారికి ఉచితంగా మందులతో పాటుకళ్ళ అద్దాలు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా జిల్లా ఎస్పీ నరసింహ, కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి లు హాజరు కానున్నారని తెలిపారు. అవకాశాన్ని డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని సీఐ చరమందరాజు కోరారు. ఈ సమావేశంలో ఎస్ఐ మోహన్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.