22-02-2026 03:36:30 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామం మండేపల్లి రెడ్డి సంఘ భవన కార్యాలయంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గాదగోని సాగర్ ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. సిరిసిల్లకు చెందిన శ్రీ భవానీ ఐ క్లినిక్ & ఆప్టికల్ వారి సహకారంతో ఈ ఉచిత కంటి శిబిరం జరిగింది. సుమారు 30 మంది గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో నలుగురికి ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. ఈ శిబిరంలో దగ్గర చూపు, దూరం చూపు, తలనొప్పి, మెడనొప్పి, మోతిబిందు వంటి అన్ని రకాల కంటి సంబంధిత పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఉచితంగా కంటి పరీక్షలు మరియు ఉచిత ఆపరేషన్లు అందించనున్నందుకు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.