విశ్రాంత ఉద్యోగులకు ఉచిత నేత్ర వైద్య పరీక్షలు
16-07-2026 01:52 AM
సత్తుపల్లి జూలై15 (విజయక్రాంతి): పట్టణ కేంద్రంలో గల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో, బుధవారం ఉచిత నేత్ర పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. శరత్ మాక్స్ విజన్ సంస్థ పలువురికి పరీక్షలు నిర్వహించింది. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ఖమ్మం తీసుకుని వెళతామని శరత్ మాక్స్ విజన్ సిబ్బంది విక్రమ్ సింగ్, అనిల్, కరుణ, లెనిన్ తెలిపారు. ఈ శిబరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు ఏ.యస్.ప్రకాశరావు, అద్దంకి వెంకటరత్నం, రామిశెట్డి సుబ్బారావు, బూరుగు దాసు, యోగానందం, నర్సయ్య పాల్గొన్నారు.






