8 June, 2026 | 4:57 AM

వ్యవసాయ కార్మిక కుటుంబాలకు ఉచిత విద్య, వైద్యం అందించాలి

08-06-2026 12:12 AM

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

నేరేడుచర్ల, జూన్ 7: సంపదను సృష్టిస్తూ దేశానికి అన్నం పెడుతున్న వ్యవసాయ కార్మికులకు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వం విద్యా, వైద్యం ఉచితంగా అందించాలని ఆదివారం మేడారంలో జరిగిన సభలో తె.వ్య.కా.సo జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి సమగ్ర కేంద్ర శాసన చట్టం చేయాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12000 ఇస్తామన్న వాగ్దానం అమలు చేయాలని, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు మంజూరు చేయటం సిగ్గుచేటని, 50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు నెలకు 7500 పింఛన్ మంజూరు చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రోజురోజుకు చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని, పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల, ఫీల్ అసిస్టెంట్లకు వేతనాలు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల శ్రీధర్, సిరికొండ శ్రీను, మామిడి నాగ సైదులు, వెంకటేశ్వర్లు, కట్ట మధుబాబు, జానకి రాములు, పగిళ్ల హుస్సేన్ లక్ష్మి, సైదమ్మ, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.