10 March, 2026 | 8:37 AM

యూరియా బస్తా రూ. 300కు అమ్ముతున్నారు

09-03-2026 10:49 AM

ఫిర్యాదు చేసిన వ్యవసాయ అధికారులు పట్టించుకోవట్లేదు

వ్యవసాయ అధికారుల ముందే కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన రైతులు

కొల్చారం,(విజయక్రాంతి): రసీదులలో యూరియా బస్తా రూ.266 అమ్ముతున్నట్లు నమోదు చేస్తూ రూ 300కు విక్రయిస్తున్నారని అప్పాజీపల్లి గ్రామానికి చెందిన రైతులు జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్(Collector Pratima Singh) కు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం కొల్చారం మండలం అప్పాజీపల్లి లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పంటల నమోదు యాప్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ వచ్చారు.

ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతులు యూరియా కొరత తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు మండలంలోని రంగంపేట దుంపలకుంట లోని ఎరువుల దుకాణాలకు గత రెండు రోజుల క్రితం యూరియా సరఫరా కాగా రూ.300 బస్తా చొప్పున యూరియా విక్రయించారని ఈ విషయమై మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మండలంలో రైతు వేదికలలో ఏఈవోలు అందుబాటులో ఉండడం లేదని, మండల వ్యవసాయ అధికారి సైతం తన కార్యాలయంలో అందుబాటులో ఉండరని రైతులు తెలిపారు.

ఏదైనా సమస్యపై మండల వ్యవసాయ అధికారి కార్యాలయానికి వెళ్తే నిర్లక్ష్యంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతారని రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే సంబంధిత ఎరువుల దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ ను ఆదేశించారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలు పరిష్కరించాలని వీధిలో పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు