15 June, 2026 | 3:11 PM

Breaking News

మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •  

మోసం..దగా

05-12-2025 01:54 AM
  1. విజయక్రాంతి కథనానికి స్పందన

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన  

తూకాలలో తేడాలు ఉంటే సహించేది లేదని హెచ్చరించిన డీసీఓ ప్రవీణ్ 

మోతె, డిసెంబర్04 : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకాలు ఎక్కువ వేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మోసం.. దగా! శీర్షికన ’విజయక్రాంతి’లో ప్రచురితరమైన కథనానికి అధికారులు స్పందించారు.  గురువారం మండల పరిధిలోని నేరడవాయి గ్రామంలోని వడ్డెర గూడెంలో పి యస్ సి యస్ కొనుగోలు కేంద్రంను డి సి ఓ ప్రవీణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ధాన్యం రాశులు, కాంటాలను పరిశీలించాడు. కాంటలు వేసే చోట వసతుల గురించి నిర్వాహకులను, రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా మ్యాచర్ వచ్చిన దాన్యం మాత్రమే కాంటాలు వేయాలని , 41 కె జి ల లోపు మాత్రమే కాంటలు వేయాలని తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద రైతులకు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈయన వెంట  సి ఇ ఓ ఉపేందర్, రైతులు ఉన్నారు.