10 August, 2026 | 8:23 PM

ఎల్ హెచ్ పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా భూక్య మంగీలాల్ నాయక్ నియామకం

10-08-2026 06:54 PM

చుంచుపల్లి,(విజయక్రాంతి): కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో  నంగారా భేరి లంబాడి హక్కుల పోరాట సమితి  తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా భూక్యా మంగీలాల్ నాయక్ ను నియమిస్తూ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్, వ్యవస్థాపక  జాతీయ అధ్యక్షులు డాక్టర్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర అధ్యక్షులు మూడావత్ రాంబాల్ నాయక్ ఆదేశాల మేరకు నియమించడం జరిగింది. లంబాడి, గిరజన సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తు,లంబాడి, గిరజనుల అభివృద్ధికి తోడ్పడుతూ గిరిజన చట్టాలను పరిరక్షణ కోసం రాజీలేని పోరాటాలు చేస్తూనే లంబాడిలను రాజకీయ చైతన్యం వైపు నడిపిస్తామన్నారు.   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించిన జాతీయ, రాష్ట్ర, నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.