ఘనంగా లక్ష బిల్వార్చన పూజ
10-08-2026 07:06 PM
మేళ్లచెరువు,(విజయక్రాంతి): మేళ్లచెరువులోని శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో సోమవారం పర్వదినం, ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పలు పూజాది కార్యక్రమాలు వేద పండితులు ఘనంగా నిర్వహించారు. లోకం సుభిక్షంగా ఉండాలని వర్షాలు కురవాలని కోరుతూ లక్ష బిల్వార్చన పూజ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల అనంతరం దేవాలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రాసాద వితరణ జరిపారు. సూర్యాపేట మాజీ కలెక్టర్ అజయ్ కుమార్ పూజలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పెండ్లి లచ్చయ్య, పాలకవర్గ సభ్యులు వి. నాగరాజు బి. వెంకటరెడ్డి ఎం.శ్రీనివాసరెడ్డి బి. రామారావు ఎస్.రామకృష్ణ దేవకర్ణ, బి రాజారావు, అర్చకులు కే విష్ణువర్ధన్ శర్మ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






