అంబేద్కర్ నగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శ్రీకారం
10-08-2026 07:17 PM
జవహర్‌నగర్,(విజయక్రాంతి): జవహర్‌నగర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మేయర్, జవహర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతగాని శాంతి కోటేశ్ గౌడ్ మాట్లాడుతూ... ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు. డ్రైనేజీ, రోడ్డు సమస్యల పరిష్కారంతో స్థానికులకు ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు బలి శ్రీనివాస్, శంకర్, యాదగిరి గౌడ్ మరియు కాలనీవాసులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.






