10 August, 2026 | 8:17 PM

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానం

10-08-2026 06:51 PM

నిర్మల్,(విజయక్రాంతి): బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పదవులు పొందిన బీసీ నాయకులకు సోమవారం సన్మానం చేశారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని బీసీ సంఘ భవనంలో ఇటీవల శ్రీ గండి రామన్న దత్త సాయి ఆలయ కమిటీ చైర్మన్‌ గా నియమితులైన కొట్టే శేఖర్‌ ను, గౌరవ డాక్టరేట్‌ పొందిన జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు డాక్టర్ కత్రోజు అశోక్‌ చారిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కృష్ణంరాజు ఘనంగా సన్మానించారు.